ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే జారే*
అక్షరవిజేత,అశ్వారావుపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో రైతు భరోసా - విజయోత్సవాల కార్యక్రమం* లో భాగంగా రోజు అశ్వారావుపేట రైతు వేదిక నందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల తో ముఖా ముఖి కార్యక్రమంలో అశ్వారావుపేట నియోయక వర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అలాగే ట్రైనీ కలెక్టర్ సౌరబ్, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు*. అశ్వారావుపేట రైతు వేదిక నందు హాజరవడం జరిగింది.మన జిల్లా లో ఇప్పటి వరకు 1,76,236 మంది రైతులకు 305.09 కోట్లు అలాగే అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు 45058 రైతులకు 81.39 కోట్లు జమ చేయటం జరిగింది అని తెలిపారు, ఈ కార్యక్రమంలో రైతులతో కలెక్టర్ రైతులతో బయోచార్ తయారీ, అజోల్లా పెంపకం, మునగ సాగుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జె కిషోర్, జిల్లా ఉద్యాన అధికారి,సుజాత మున్సిపల్ కమిషనర్ అశ్వారావుపేట,పి. రవికుమార్ - సహాయ వ్యవసాయ సంచాలకులు అశ్వారావుపేట తహసిల్దార్ సిహెచ్ వి రామకృష్ణ, బి. సాయి నారాయణ, టెక్నికల్ వ్యవసాయ అధికారి.పి. శివ రామ ప్రసాద్ - మండల వ్యవసాయ అధికారి ఏసతీష్, ఎన్ రవీంద్ర రావు, వ్యవసాయ విస్తారణ అధికారులు,ఎలక్రికల్ ఏడి అశ్వారావుపేట మండల కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి ప్రమోద్. మొగళ్ళపు చెన్నకేశవరావు,మిండ హరిబాబు. పణి.మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.